PAVITROTSAVAMS CONCLUDES_ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Chandragiri, 21 Oct. 19: The three day pavitrotsavams concluded in Chandragiri Sri Kodanda Rama Swamy temple on Monday.

After the morning rituals, Purnahuti was performed by the temple priests amidst the chanting of vedic mantras.

Temple DyEO Sri Subramanyam and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
 
తిరుపతి, 2019 అక్టోబరు 21: చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. 
 
ఉదయం 9.00 నుండి 11.00 గంట వరకు ద్వారాతోరణ, ధ్వజకుంభారాధన,  చతుష్టార్చన,  మూర్తిహోమం, శాంతిహోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, వేదశాత్‌మొర కార్యక్రమాలు నిర్వహించారు. 
 
అనంతరం ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతస్వామివారు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చక్రతాళ్వార్‌కు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. 
 
అనంతరం సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కృష్ణారావు, కంకణభట్టర్‌ శ్రీ కృష్ణభట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.