KARTHIKA DEEPOTSAVAM HELD IN SRI TT _ తిరుమ‌ల‌లో ఘ‌నంగా కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

TIRUMALA, 18 NOVEMBER 2021: The annual Karthika deepotsavam was observed with religious fervour in the Tirumala temple on Thursday evening.

 

The temple premises including the sub-temples where illuminated with the traditional ghee lit lamps on the occasion.

 

Tirumala Sri Pedda Jeeyangar Swami, Temple DyEO Sri Ramesh Babu, temple Peishkar Sri Srihari and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో ఘ‌నంగా కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

తిరుమల‌, 2021 నవంబరు 18: తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం ఘనంగా జ‌రిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వ‌హించారు.

ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో  మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప‌క్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్ల‌లో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. ఆ త‌రువాత వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూల‌మూర్తికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత  గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వ‌ద్ద నేతిదీపాల‌ను ఉంచారు.

ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.