SRIVARI AGARBATIS TO SPREAD FRAGRANCE IN DEVOTEES HOUSEHOLDS SOON _ తుది ద‌శ‌కు చేరుకున్న అగ‌ర‌బ‌త్తుల త‌యారీ _ ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లు

SEVEN ICONIC AGARBATTI BRANDS AT SEVEN HILLS GETS READY FOR SALES FROM SEPTEMBER 13 ONWARDS

Tirumala, 07 September 2021: Devotees of Sri Venkateswara Swamy across the globe begins their daily routine to the divine chant of Sri, Seshasaila, Garudachala, Venkatadri, Narayanadri, Vrishabhadri, one of the most important phrases in the famous Suprabhatam comprising the names of Seven sacred hills.

Soon the devotees will experience the divine aroma of Abhayahasta, Tandanana, Divya pada, Akrusti, Shrusti, Tushti, Drusti-the Seven iconic incense sticks manufactured by TTD in their households.

The preparation of incense sticks or Agarbattis out of the used aromatic flower garlands gathered from all the TTD temples will be ready to scent the houses of devotees from next week onwards.

The TTD management conceived the project of reusing tons of flower garlands used in all its temples daily and in huge quantities during festivals and special occasions as Agarbattis instead of dumping them in the garbage.

After several consultations, it entered into an agreement with Bengaluru-based Darshan International Private Limited to produce Agarbattis in a cost-effective and non-profit way.

As per agreement, TTD provided required land and civil constructions to the company which installed machinery and required staff and started experimental production of Agarbattis a few days ago.

 MAKING OF AGARBATTIS

All the used flowers and garlands are transported by the TTD garden department to SV Goshala Agarbatti Production Centre where trained personnel categorise the flowers and mechanically dry and transform the residue into powder.

Thereafter the powder is mixed with chemicals and water into a paste which is then produced as Agarbatti sticks. Later they are dried in machines for 15-16 hours and soaked in aromatic liquid again in another machine. After another round of drying they are packed in machines for the final product-the divine aromatic Agarbattis.

TTD has installed ten state of art machinery to produce 3.5 lakh Agarbattis daily. The pricing details of these seven iconic Agarbattis as follows.

1. Abhayahasta : 100 grams  at Rs.60.


  1. Tandanana.   : 100 grams at Rs.60

  2. Divya pada: 100 grams at Rs.60

  3. Akrusti : 65 grams at Rs.125.

  4. Shrusti :   65 grams at Rs.125

  5. Tushti : 65 grams at Rs.125.

  6. Drusti : 65 grams at Rs.125.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తుది ద‌శ‌కు చేరుకున్న అగ‌ర‌బ‌త్తుల త‌యారీ

ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లు

సెప్టెంబ‌రు 13న విక్ర‌యాల ప్రారంభానికి ఏర్పాట్లు

తిరుమల, 2021 సెప్టెంబ‌ర్ 07: టిటిడి ఆల‌యాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. శ్రీ‌వారి ఏడు కొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి అగ‌ర‌బ‌త్తుల విక్ర‌యాల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

టిటిడి ఆల‌యాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ఉత్స‌వాల స‌మ‌యంలో పుష్పాల వినియోగం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ర‌కంగా ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. స్వామి సేవ‌కు ఉప‌యోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై టిటిడి యాజ‌మాన్యం ఆలోచ‌న చేసింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ టిటిడి ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభం లేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి అందిస్తామ‌ని ముందుకొచ్చింది. ఈ మేర‌కు ఆ సంస్థ‌తో టిటిడి అవ‌గాహ‌న కుదుర్చుకుని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయించింది. ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని కొన్ని రోజులుగా ప్ర‌యోగాత్మ‌కంగా అగ‌ర‌బ‌త్తుల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.

అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ఇలా..

టిటిడి స్థానికాల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను ఉద్యాన‌వ‌న విభాగం సిబ్బంది ఎస్వీ గోశాల‌లోని అగ‌ర‌బ‌త్తుల త‌యారీ కేంద్రానికి త‌ర‌లిస్తారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన సిబ్బంది వీటిని ర‌కాల వారీగా పుష్పాల‌ను వేరు చేస్తారు. అనంత‌రం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ త‌రువాత పిండికి నీరు క‌లిపి కొన్ని ప‌దార్థాల‌తో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్ర‌మాన్ని మ‌రో యంత్రంలో వేసి అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేస్తారు. వీటిని ప్ర‌త్యేక యంత్రంలో 15 నుంచి 16 గంట‌ల పాటు ఆర‌బెట్టిన త‌రువాత మ‌రో యంత్రంలో ఉంచి సువాస‌న వెదజ‌ల్లే ద్రావ‌కంలో ముంచుతారు. చివ‌ర‌గా వీటిని మ‌రోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 ల‌క్ష‌ల అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేలా ఏర్పాట్లు చేశారు.

విడుద‌ల చేయ‌నున్న బ్రాండ్‌లు ఇవి..

1. అభ‌య‌హ‌స్త

2. తంద‌నాన

3. దివ్య‌పాద

4. ఆకృష్టి

5. సృష్టి

6. తుష్టి

7 దృష్టి

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.