PEDDA JEEYANGAR MUTT COMPLETES 900TH ANNIVERSARY _ తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో పెద్ద శాత్తుమొర‌

TIRUMALA, 07 SEPTEMBER 2021: The Pedda Jeeyangar Mutt in Tirumala, established by the great Sri Vaishnavaite saint Sri Ramanujacharya at Tirumala, completed its 900th Anniversary on Tuesday.

To commemorate the occasion, Tirumala Sri Pedda Jiyar Swamy along with Tirumala Sri Chinna Jiyar Swamy and disciples, recited Nalayira Pasura Parayanam from September 3 to 7. Apart from this, Ramanuja Nutrandadi and Upadesa Rathnamala were also recited as Akhanda Parayanam seeking the divine blessings for the well-being of humanity.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో పెద్ద శాత్తుమొర‌

తిరుమ‌ల‌, 2021 సెప్టెంబ‌రు 07: తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం స్థాపించి 900 సంవత్సరాలు పూర్త‌యిన‌ సందర్భంగా శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ స్వామి మ‌ఠంలో మంగ‌ళ‌వారం ఉద‌యం పెద్ద శాత్తుమొర, విశేష పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శ్రీశ్రీశ్రీ రామానుజులవారు తిరుమలలో పెద్ద జీయర్ మఠం స్థాపించిన విషయం విదితమే.

లోక క‌ల్యాణార్థం, క‌రోనా వ్యాధి మూడ‌వ వేవ్ వ్యాప్తి నివార‌ణ‌కు శ్రీ‌వారిని ప్రార్థిస్తూ శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌రు 3నుండి 7వ తేదీ నుండి ఆళ్వారులు ర‌చించిన 4 వేల పాశురాల‌ను, రామానుజ నూత్తందాది, ఉప‌దేశ ర‌త్న‌మాల అఖండ పారాయ‌ణం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, శిష్యు బృందం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.