తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించలేదు : టీటీడీ

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు తిరస్కరించలేదు : టీటీడీ

తిరుమల 11 జూలై 2021: తిరుమలలో తమ సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏవిధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతవారం కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చారు. విఐపి బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించడం జరిగింది. అయినప్పటికీ కొందరు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో వాటికి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం చేయించడం జరిగింది. అలాగే గదులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతోంది.

వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు అవాస్తవ ఆరోపణలు చేయడం తగదు. ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది