SRIVARI TEMPLE AT CHENNAI SOON, TTD CHAIRMAN _ త్వరలో చెన్నై శ్రీవారి ఆలయం పునర్నిర్మాణం : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

SRI PADMAVATI IDOL INSTALLED AT SRI PAT CHENNAI

PRANA PRATISTA AND MAHA KUMBHABISHEKAM ON MARCH 17

Tirupati,16, March 2023:  TTD chairman Sri YV Subba Reddy said on Thursday that steps are underway to construct a majestic Sri Venkateshwara temple at T nagar in Chennai.

.Along with his spouse Smt Swarnalata, the TTD chairman participated in the Vigraha Pratista event at the newly built Sri Padmavati temple on the GNChetty Road, Chennai.

Speaking later the TTD chairman said the temple consecration ritual was held in the morning 09.00-09.45 am at the ₹40 crore worth of land donated by cine actress Kanchana family at a cost of₹10 crore by the TTD. Similarly a Gali gopuram and other buildings worth ₹5 crore were got up with donations of the Chennai local advisory committee president Sri Sekhar Reddy and member Smt Smita.

TTD chairman said the pontiff of Vishakha Sharada Peetham Sri Sri Sri Swaroopananda Saraswati Swami will supervise the rituals of Prana Pratista and Maha Kumbhabhisekam on Friday morning and Sri Padmavati Ammavari Darshan will commence to devotees thereafter from 0900 hours. All Kainkaryas and tirtha Prasadam will be performed at the new temple on the lines of Tiruchanoor Sri PAT, he said.

Earlier on Thursday the rituals of Chatustarchana, Murti Homa, Purnahuti, Dwaja stambha Chaya Jaladhivasam,  Nayana Milana were performed and later in the evening Shayanadhivasam was also held under the direction of TTD Pancha Ratra Agama adviser Sri Srinivasa Charyulu.

TTD JEO Sri Veerabrahmam, Chennai local advisory committee president sri Sekhar Reddy and DyEO Sri Vijay Kumar were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

త్వరలో చెన్నై శ్రీవారి ఆలయం పునర్నిర్మాణం : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
– శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి విగ్రహప్రతిష్ట
 
– మార్చి 17న ప్రాణప్రతిష్ట, మహాకుంభాభిషేకం
 
తిరుపతి, 16 మార్చి 2023: చెన్నై టి నగర్ లోని  శ్రీవారి ఆలయం  త్వరలో పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. చెన్నై నగరంలోని జిఎన్ చెట్టి వీధిలో టీటీడీ  నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం జరిగిన  విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో ఛైర్మన్ దంపతులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉదయం 9 నుండి 9.45 గంటల మధ్య  అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని చెప్పారు. ప్రఖ్యాత సినీనటి శ్రీమతి కాంచనతోపాటు వారి కుటుంబ సభ్యులు రూ.40 కోట్లకు పైగా విలువైన ఈ  స్థలాన్ని టీటీడీ కి విరాళంగా అందించారని తెలిపారు. దాతలతోపాటు చెన్నై భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ స్థలంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించినట్టు చెప్పారు. టీటీడీ రూ.10 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టిందని, దీంతోపాటు చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, సభ్యులు శ్రీమతి స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
 
 ఆలయంలో శుక్రవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ప్రాణప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తరహాలోనే ఇక్కడ నిత్య కైంకర్యాలు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తామన్నారు.
 
కాగా, గురువారం ఉదయం చతుష్టానార్చన, మూర్తిహోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, ధ్వజస్తంభ ఛాయ జలాధివాసం, బింబ నయనోన్మీలనం నిర్వహించారు. సాయంత్రం శయనాధివాసం చేపట్టారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.