TTD FILES CASE ON REVATI PADMAVATI TRAVELS _ దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు – రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు

Tirumala, 25 July 2021: The TTD has registered a case against Chennai based Revati Padmavati Travels on Sunday for fleecing devotees in the name of online booking of Srivari Darshan tickets.

Sending a strong signal against brokers as agencies engaged in fleecing Srivari devotees, the TTD vigilance officials filed a case of cheating on the travel agency for collecting huge money from innocent devotees.

TTD said the online quota of Rs. 300, Special Entry Darshan (SED) tickets made with the Kalyanotsavam tickets were regularly released on the 20th of every month. TTD said it has created a convenient and devotee friendly digital facility on its portal www tirupatibalaji.ap.gov.in where devotees could book their tickets comfortably with Aadhar card and address and there was no need to depend on brokers.

TTD warned that stringent action would be taken against all such fraudulent agencies and brokers meddling with the sentiments of devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు – రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు

తిరుమల 25 జూలై 2021: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ 300 టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుంది.

కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నై కి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ భక్తులనుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.. భక్తులు www tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామా తో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది