GRAND COMMENCEMENT OF ASHTABANDHANA MAHASAMPROKSHANAM AT DEVUNI KADAPA TEMPLE _ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన

SACRED VEDIC RITUALS PERFORMED AS PER AGAMA TRADITIONS

Tirupati / Devuni Kadapa, August 24, 2026: The Jeernoddharana Ashtabandhana Mahasamprokshanam rituals at Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, commenced grandly on Monday with devotion and traditional fervour.

As part of the first-day rituals, priests performed Manonmana Pramana Shanti Homam, Kumbha Sthapana, Panchagni Pranayanam and Sattumora in accordance with Agama traditions from 8 a.m. Special Vedic rituals will be performed at the Yagasala at 6.30 p.m.

Ashtabandhanam on August 25

On August 25, Chatushthanarchana, Ekashiti Kalasa Snapanam, Murthi Homam and Ashtabandhanam will be performed from 7.30 a.m. In the evening, Shayyadhivasam, Tattva Homams, Shanti Homam and Sattumora will be conducted from 6 p.m.

Mahasamprokshanam on August 26

On August 26, Chatushthanarchana, Murthi Homam and Prayaschitta Homam will be performed from 7 a.m.

The Maha Poornahuthi, Mahasamprokshanam and Kalakarshanam will be performed as per Agama traditions from 9.45 a.m. to 11.30 a.m. under the auspicious Shravan Nakshatra and Tula Lagna.

Devotees will be allowed darshan of Sri Lakshmi Venkateswara Swamy after completion of the Mahasamprokshanam rituals.

AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Eshwar Reddy and temple priests participated in the sacred rituals.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన

మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమైన పవిత్ర వైదిక కార్యక్రమాలు

తిరుపతి / దేవుని కడప, 2026 ఆగస్టు 24: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు సోమవారం భక్తిశ్రద్ధలతో, ఆగమోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.

మొదటి రోజు ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, శాత్తుమొర తదితర వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆగస్టు 25 అష్టబంధనం

ఆగస్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర కార్యక్రమాలు జరుగుతాయి.

ఆగస్టు 26 మహాసంప్రోక్షణ

ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమ శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించనున్నారు.

మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.

ఈ పవిత్ర కార్యక్రమాల్లో ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.