UNPARALLELED HINDU DHARMA PRACHARA BY TTD- CHAIRMAN _ దేశంలో మరెక్కడా లేనంతగా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం- టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి

Tirupati, 22 May 2023: TTD Chairman Sri YV Subba Reddy said that TTD has rolled out unparalleled Sanatana Hindu dharma propagation in SC, ST, fishermen and BC remote villages across the country and that a ₹2 crore Kalyana mandapam will be built at Rampachodavaram soon.

Speaking to reporters after participating in the Maha Samprokshana fete of the newly built Sri Venkateswara temple at Rampachodavaram, the TTD Chairman said upon directions of Honourable AP CM Sri YS Jaganmohan Reddy the SV temple was constructed at a cost of ₹7.5 crore including other development works.

He said a similar SV temple and a Kalyan mandapam was built at Seethampeta. All the tribals were provided Vaikunta Dwaram Darshan and Srivari Brahmotsava Darshanam at Tirumala freely besides providing them transport, rooms and Anna Prasadam.

He said TTD has plans to build  2500 Srivari temples in all SC, ST, BC villages and said more Srivari Sevakulu from these regions are expected to visit Tirumala and offer their services to fellow pilgrims.

Local MP Sri Bharat, MLA Smt Dhanalakshmi were present, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, PRO Dr T Ravi, DyEOs Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Siva Prasad, VGO Sri Manohar and others were present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

దేశంలో మరెక్కడా లేనంతగా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం

– రంప చోడవరంలో రూ 10కోట్లతో ఆలయం, కల్యాణ మండపం

టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి

తిరుపతి 22 మే 2023: దేశంలో మరెక్కడా లేని విధంగా టీటీడీ గిరిజన, ఎస్సీ, మత్స్య కార, బిసి గ్రామాల్లో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి తెలిపారు. రంపచోడవరంలో రూ 2 కోట్లతో కల్యాణ మండపం నిర్మించి గిరిజనులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చైర్మన్ భక్తులతోను, మీడియాతోను మాట్లాడారు.  మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ భక్తుడు శ్రీ అల్లూరి సీతా రామరాజు నడయాడిన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మరింత దగ్గర చేసి వారికి స్వామి అశీస్సులు అందేలా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రంపచోడవరంలో రూ.7.50 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మించామన్నారు. మరో రూ . 50లక్షలతో ఇతర అభివృద్ధి పనులు కలుపుకుని మొత్తం రూ 10 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మహాసంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

రంపచోడవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
ఇటీవల సీతంపేటలో రూ.10 కోట్లతో అన్ని సదుపాయాలతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కల్యాణ మండపం నిర్మించడం జరిగిందన్నారు.

జీవితంలో ఒక్కసారి కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోలేని గిరిజనులకు రవాణా, వసతి, ఆహారం ఉచితంగా కల్పించి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనం ఉచితంగా చేయిస్తున్నామని చైర్మన్ వివరించారు.

గిరిజన, ఎస్సీ, బిసి గ్రామాల్లో సుమారు 2500 ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రాంతాల్లో నుంచి స్వామివారి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో వేలాది మంది శ్రీవారి సేవకులుగా తిరుమలకు విచ్చేసి తోటి భక్తులకు సేవ చేయడం అభినందించదగ్గ విషయని అభినందించారు . రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల నుండి మరింతమంది శ్రీవారి సేవకులుగా భక్తులకు సేవలు అందించేందుకు సిద్ధం కావాలని కోరారు.
ఎంపి శ్రీమార్గాని భరత్, ఎమ్మెల్యే శ్రీ ధనలక్ష్మి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది