SRINIVASA KALYANAM HELD AT RAMPACHODAVARAM _ రంపచోడవరం శ్రీవారి ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం 

Tirupati, 22 May 2023: The celestial Srinivasa Kalyanam was observed with utmost devotion and religious fervour in Srivari temple at Rampachodavaram in Alluri Seetaramaraju district on Monday evening.

The deities of Sri Bhu sameta Sri Srinivasa were seated on a finely decked platform and the divine wedding ceremony was carried out by Archakas amidst the chanting of Veda mantras in traditional Hindu wedding style.

A large number of devotees took part in this celestial Kalyanam.

DyEO Sri Guna Bhushan Reddy, other staff were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

రంపచోడవరం శ్రీవారి ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం
 
తిరుపతి, 2023 మే 22: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం రాత్రి  శ్రీవారి క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా జరిగింది.
 
ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన రంపచోడవరం పరిసర ప్రాంతాల భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు.
 
 ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్ రెడ్డి, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.