TTD MANUSCRIPTS PROJECT SHOULD BE IDEAL TO THE COUNTRY-TTD EO _ దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

RESEARCH ON MANUSCRIPT PROJECT TO BE ENCOURAGED

 

TIRUPATI, 20 MARCH 2023: The Manuscript Project of TTD should emerge ideal and stand as an Iconic Project in the entire nation said, TTD EO Sri AV Dharma Reddy.

 

The EO held a review meeting on the project in SV Vedic University on Monday with the officials concerned to verify the progress of ongoing works. He aspired that the scholars should do research and PhDs on these rare Manuscripts which were scanned and treasured in SV Vedic University. The EO said out of 5500 Manuscript books brought from ASI, scanning of around 3370 were completed. A total of 2,11,313 Manuscripts are available in these “Talapatra Grandhas”, he added. 

 

He has also instructed to complete the scanning of the remaining Manuscripts within a span of two months. “For this we will provide necessary infrastructure and manpower to complete the task on time”, he added. 

 

Earlier, the officials explained EO over the progress of works with the help of a Power Point Presentation. The EO also learnt from them the process of research, scanning, cleaning of Manuscripts and safeguarding techniques. The EO was also told that there are very rare manuscripts available in Jyothisha, Vedanta, Purana, Kavyas which need to be scanned for the sake of future generations. Reacting to this, the EO said, they are the treasure of the country and those manuscripts need to be translated into Telugu which is understandable even to a common individual. In coordination with the Sanatana Jeevan Trust the Manuscript Project of TTD should emerge top in the entire country”, he reiterated.

 

JEO for Health and Education Smt Sada Bhargavi, Vice-Chancellor of SVVU Sri Rani Sadasiva Murthy, Manuscripts Project DyEO Smt Vijayalakshmi, Registrar Sri Radheshyam and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు

– వీటిపై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలి

టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుపతి 20 మార్చి 2023: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మాను స్క్రిప్ట్స్ పై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలన్నారు.

మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, పురావస్తు శాఖ నుంచి తెచ్చిన సుమారు 5500 తాళపత్ర గ్రంధాల్లో ఇప్పటివరకు 3370 తాళపత్ర గ్రంధాలు స్కాన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 2,11,313 తాళపత్రాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. రెండు నెలల్లో మిగిలిన గ్రంధాలను కూడా స్కాన్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సిబ్బందిని ఇస్తామని ఈవో వివరించారు. ప్రస్తుతం రోజుకు ఎన్ని తాళపత్రాలు స్కాన్ చేస్తున్నారు, తాళపత్రం శుభ్రపరచడం నుంచి తైల శోధన, స్కానింగ్ వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి ఈవో తెలుసుకున్నారు. వేదాంతం, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్యం తదితర అంశాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని అధికారులు శ్రీ ధర్మారెడ్డి కి వివరించారు. ఇవి జాతి సంపద అని, వీటిని జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తెలుగులో తర్జుమా చేయాలని ఈవో అధికారులకు సూచించారు. ఇలా తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ పుస్తకాల ఆధారంగా పి హెచ్ డి చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించి పిహెచ్ డి లు ప్రదానం చేసే ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఇంకా ఎక్కడ మాను స్క్రిప్ట్స్ ఉన్నాయో తెలుసుకుని వాటిని సేకరించి స్కాన్ చేసి భద్రపరచ గలిగితే పరిశోధకులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రంధాలను అంశాల వారీగా వర్గీకరించి వాటికి ప్రత్యేకంగా నంబర్లు వేసి భద్రపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన జీవన్ ట్రస్టు సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆయన ఆకాంక్షించారు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి, విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు డిప్యూటీ ఈవో శ్రీమతి విజయలక్ష్మి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యాం సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది