ANNUAL FETE COMMENCES WITH DHWAJAROHANAM AT KRT _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం 

TIRUPATI, 20 MARCH 2023: The annual brahmotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati commenced on a grand note with Dhwajarohanam on Monday in the auspicious Mesha Lagnam between 9:20am and 9:32am.

Kankanabhattar Sri Anandakumar Deekshitulu carried out the temple ritual proceedings as per the tenets of Agama.

Speaking on the occasion, JEO Sri Veerabrahmam said, the Kodandarama Swamy annual festival commenced with Dhwajarohanam. The important days includes Ugadi on March 22, Garuda Seva on March 24, Hanumantha Vahanam on March 25, Rathotsavam on March 27, Chakra Snanam on March 28. As the annual fete is taking place in a full-fledged manner after Covid pandemic, the devotees shall participate in large numbers and embrace the blessings of Sri Kodandarama, he added.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and other officials, devotees were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మార్చి 20: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఉదయం 9.20 నుండి 9.32 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.

అంతకుముందు ఉదయం 7 నుండి 8.45 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంత‌రం ఉదయం 9.45 నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వీర బ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, ధ్వజారోహణంతో శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానం, మార్చి 24న గరుడ సేవ, మార్చి 25న హనుమంత వాహనం, మార్చి 27న రథోత్సవం, మార్చి 28న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రులు కావాలన్నారు.

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

కాగా, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.