Seetha Rama Kalyanam in Sri K.R.Temple, Tirupat _ నయనమనోహరంగా శ్రీ సీతారాముల కల్యాణం 

Tirupati, 13 Apil 2011: Seetha Rama Kalyanam have been performed with religious fervour amidst Vedic chantings by the temple priest at Sri Kodanda Rama Swamy Temple, Tirupati on

Wednesday evening. Large number of devotees have attended the Kalyanam and had the blessings of the Lord Rama. The Archakas have performed the Kalyanam for more than two hours and they have explained the devotees the importance of Seetha Rama Kalyanam on this occasion.

 

Earlier Muthyala Haram and Nuthana Vastram were taken out in a procession by Sri K.Bhaskar, Joint  Executive Officer TTDs from TTD Adm Bldg to Sri Kodanda Rama Swamy Temple.

 

Sri M.K.Singh, C.V&S.O, Smt. Jhansi Rani, DyE.O(LT), Sri Manohar V&S.O and devotees witnessed the celestial wedding.
 
 

నయనమనోహరంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, ఏప్రిల్‌,13, 2011: ఆదర్శదాంపత్య జీవితానికి మార్గదర్శిగా నిలిచిన శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం తిరుపతిలోని తితిదేవారి శ్రీకోదండరామాలయంలో బుధవారం సాయంత్రం నయనమనోహరంగా జరిగింది.

”కల్యాణము చూతమురారండి – శ్రీ సీతారాముల కల్యాణము చూతమురారండి” అంటూ పురజనులు శ్రీకోదండరామాలయానికి ఏతెంచి ఈ సుందర ఘట్టాన్ని తిలకించి పులకించారు. అంతకు పూర్వం సాయంత్రం 5.30 గంటలకు తిరుమల జె.ఇ.ఓ. శ్రీ కె.భాస్కర్‌, తితిదే పరిపాలనా భవనంలోని ట్రెజరీ విభాగము నుండి శ్రీ సీతారాములకు సమర్పించే ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా శిరస్సుపై పళ్ళెంలో తీసుకొని శ్రీ కోదండరామాలయానికి వేంచేసారు. ఈ ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల కల్యాణ సమయంలో వినియోగించడం ఆనవాయితి.

కోదండరామాలయం చెంత జె.ఇ.ఓ. శ్రీ కె.భాస్కర్‌కు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. సుమారు రాత్రి 7.00 గంటల సమయంలో ప్రారంభమైన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఈ ఆదర్శ దంపతుల ఉత్సవమూర్తులు ముత్యాల తలంబ్రాలను ఒకరి శిరస్సుపై మరొకరు విలాసంగా వేసే తంతు భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది.

ఈ కార్యక్రమంలో ఉన్నత శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి-సర్వీసస్‌ విభాగము శ్రీమతి సూర్యకుమారి, ఉన్నత శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి – జనరల్‌ విభాగము శ్రీ టి.ఎ.పి.నారాయణ, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, అదనపు గణాంకాధికారి శ్రీ బాలాజీ తదితర తితిదే అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.