BRING BACK PAST GLORY TO ANCIENT TEMPLES- TTD CHAIRMAN _ పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 04 February 2023: TTD Chairman Sri YV Subba Reddy said that under directives of the Honourable Chief Minister of AP Sri YS Jaganmohan Reddy, TTD is striving to rejuvenate the ancient and dilapidated temples.

Laying the foundation stone for the construction of a TTD Kalyana Mandapam at Udumulapadu and Gundala village near Dhone in Nandyal district along with state minister, Sri B Rajendranath, the TTD Chairman said as on date funds have been released for the revival of nearly 800 temples as part of Hindu Dharma propagation.

He said TTD had sanctioned money for building temples with SRIVANI Trust funds in SC/ST /BC and fishermen communities besides TTD Kalyana Mandapams in Pulivendula, Dhone and S Gundala constituencies.

Local MP Sri Pocha Brahmananda Reddy, ZP Chairman Sri Y Papi Reddy and TTD officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి, 04 ఫిబ్రవరి 2023: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోదరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని గుండాల, ఉడుములపాడు గ్రామాల్లో టిటిడి కల్యాణ మండపాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఛైర్మన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 800 ఆలయాలు జీర్ణోద్ధరణ పనులకు నిధులు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పులివెందుల, డోన్ నియోజకవర్గం ఎస్ గుండాల ప్రాంతాల్లో టిటిడి కల్యాణ మండపాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసామన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీ శ్రీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.