TRANSPARENCY IN PURCHASE OF ELECTRIC BATTERY CARS- TTD _ పూర్తి పారదర్శకంగా బ్యాట‌రీ కార్ల కొనుగోలు

పూర్తి పారదర్శకంగా బ్యాట‌రీ కార్ల కొనుగోలు
 
తిరుపతి,  2021 సెప్టెంబ‌రు 02: బ్యాట‌రీ కార్ల కొనుగోలు విష‌యంలో మ‌త‌ల‌బు జ‌రిగింద‌ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కందారపు మురళి చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వం. వాస్త‌వ వివ‌రాల‌ను తెలియ‌జేస్తున్నాం.
 
–  తిరుమ‌ల‌లో వాహ‌నాల కాలుష్యాన్ని త‌గ్గించ‌డం ద్వారా ప‌విత్ర‌త‌ను, పర్యావరణాన్ని కాపాడేందుకు టిటిడి అధికారిక విధుల కోసం 35 విద్యుత్ కార్ల‌ను(టాటా నెక్సాన్‌) ప్రభుత్వరంగ సంస్థ అయిన క‌న్వ‌ర్జ‌న్స్ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(సిఇఎస్‌ఎల్‌) నుండి కొనుగోలు చేసింది.
 
– సిఇఎస్‌ఎల్ అనేది ప్ర‌యివేటు సంస్థ కాదు. ఇది కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వరంగ సంస్థ‌లైన ఎన్‌టిపిసి, ఆర్ఇసి, ప‌వ‌ర్‌గ్రిడ్‌, పిఎఫ్‌సిల జాయింట్ వెంచ‌ర్‌.
 
– నెల‌కు రూ.32 వేలు చొప్పున 5 సంవ‌త్స‌రాల పాటు ఇఎంఐ చెల్లిస్తే  విద్యుత్ వాహ‌నం సొంత‌మ‌య్యేలా టిటిడి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో వాహ‌నాల వార్షిక నిర్వ‌హ‌ణ వ్య‌యం(ఏఎంసి) కూడా ఇమిడి ఉంద‌నే విష‌యాన్ని గుర్తించాలి.
 
– ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన సిఇఎస్‌ఎల్ జాతీయ విధాన నిర్ణ‌యం ప్రాతిప‌దిక‌న‌ విద్యుత్ కార్ల విక్ర‌యాలు చేప‌డుతుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 4 వేల విద్యుత్ వాహ‌నాల‌ను ఈ సంస్థ విక్ర‌యించింది.
 
– సిఇఎస్‌ఎల్ సంస్థ మార్కెట్లో మిగిలిన వారికి నెల‌కు రూ.35 వేలు ఇఎంఐ చొప్పున విద్యుత్ కార్ల విక్ర‌యాలు చేప‌డుతుండ‌గా, టిటిడి ధార్మిక సంస్థ కావ‌డంతో రూ.32 వేలకే ప్ర‌త్యేక త‌గ్గింపు ధ‌ర‌తో వాహ‌నాల‌ను అందించింది.
 
వాస్తవాలు ఇలా ఉండగా, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసేముందు సంబంధిత అధికారులను సంప్రదించి ఉండాల్సింది. అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని తెలియజేస్తున్నాం. 
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 2 Sep. 21: TTD clarified on Thursday that the allegations made by CITU leader Sri K Murali on the purchase of battery cars was baseless and false.

In a statement released on Thursday evening, TTD said that with an objective of protecting the environment of Tirumala from pollution and to encourage pollution-free vehicles, TTD has purchased 35 electric cars for official use  (Tata Nexon) from Public sector company CESL.

–       The CESL is not a private concern but directly under the Union power ministry and a joint venture of NTPC, R.EC, Power Grid and PFL.

– TTD has signed an MoU for payment of EMI of Rs.32, 000 for five years inclusive of annual Maintenance Cost (AMC), it may be noted.

– CESL functions as per a national policy on the sale of electric cars and so far 4000 vehicles have been sold by the company.

TTD appeals that ‌in the face of such hard facts, persons holding responsible positions in society should at least approach concerned officials and ascertain facts and refrain from making such cheap and baseless criticism.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI