PEDDA SESHA VAHANAM TAKES PLACE_ పెద్దశేష వాహనంపై కోదండరాముడి వైభవం

TIRUPATI, 30 MARCH 2022: The Pedda Sesha Vahana Seva took place in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Wednesday evening as part of the first day of the ongoing annual Brahmotsavam.

 

After two years, the processional deities took celestial ride on the giant serpent vahanam along the Mada streets blessing devotees.

 

Both the senior and Junior Pontiffs of Tirumala, Spl Gr DyEO Smt Parvati, AEO Sri Durgaraju and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దశేష వాహనంపై కోదండరాముడి వైభవం

తిరుపతి, 2022 మార్చి 30: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు బుధవారం రాత్రి 8నుండి పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత స్వామి వారి వాహనసేవ మాడ వీధుల్లో జరగడంతో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు స్వామివారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేశారు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమయ్యాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, విజిఓ శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.