CVSO FELICITATES _ మిస్సింగ్ కేసులను ఛేదించిన 21 మంది భద్రతా సిబ్బందికి సివిఎస్వో సన్మానం

TIRUMALA, 30 MARCH 2022: TTD CVSO Sri Gopinath Jatti felicitated 21 security and CCTV technical personnel for their impressive discharging of duties in tracing out thieves, missing cases etc. and restoring the lost ones to the pilgrims.

 

The program was held in Common Command Control Room in Tirumala on Wednesday evening.

 

Stressing that the programme was meant to encourage the workforce, the CVSO said that he wish to foresee the same spirit from them in future too.

 

He also appreciated the effective monitoring of C3 centre by the Vigilance Inspector Sri M Siva Shankar.

 

This year till March 10, out of 247 cases reported, the Security personnel could able to resolve 211 successfully with the help of CCTV footages.

 

AVSOs Sri Sai Giridhar, Vigilance AVSO Sri Padmanabhan, VI Sri Pratap and other security sleuths were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

మిస్సింగ్ కేసులను ఛేదించిన 21 మంది భద్రతా సిబ్బందికి సివిఎస్వో సన్మానం

తిరుమల, 2022 మార్చి 30: తిరుమలలో తప్పిపోయిన పలువురు వ్యక్తులతో పాటు యాత్రికులు పోగొట్టుకున్న పలు రకాల వస్తువులను గుర్తించి తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేసిన 21 మంది కమాండ్ కంట్రోల్ రూమ్ భద్రతా సిబ్బందిని టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి బుధవారం సాయంత్రం సన్మానించారు. మెరుగ్గా విధులు నిర్వహించినందుకు గాను వారిని అభినందించారు.

తిరుమలలో ఈ ఏడాది జనవరి 1 నుండి మార్చి 10వ తేదీ వరకు తప్పిపోయిన పలువురు వ్యక్తులతో పాటు యాత్రికులు పోగొట్టుకున్న పలు రకాల వస్తువులకు సంబంధించి 247 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 211 కేసులను విజయవంతంగా ఛేదించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ద్వారా ఇది సాధ్యమైందని సివిఎస్వో తెలిపారు.

విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్.శివశంకర్ తోపాటు 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని, ఆరుగురు టెక్నికల్ సిబ్బందిని సివిఎస్వో అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎవిఎస్వోలు శ్రీ సాయి గిరిధర్, శ్రీ పద్మనాభన్, విఐ శ్రీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.