COMPLETE SRINIVASA SETHU WORKS BY DECEMBER -TTD EO _ శ్రీనివాస సేతు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirupati, 28 July 2022: TTD EO Sri AV Dharma Reddy directed representatives of AFCON company who had undertaken the construction works of Srinivasa Sethu in Tirupati, to complete the works by December for the convenience of pilgrims coming for Srivari Darshan at Tirumala and also residents of Tirupati city.

TTD EO reviewed the progress of ongoing works of Srinivasa Sethu with Tirupati Municipal Commissioner Ms Anupama Anjali, JEO Sri Veerabrahmam and other officials at his chambers in the TTD Administrative Building on Thursday.

Speaking on the occasion the EO said the works on Mangalam Road-Leelamahal Circle approach road be completed by September 15. Similarly, the works in Lakshmipuram Circle-Ramanuja circle be finished by August end.

He directed that the works on the Railway over bridge section be completed within 3 weeks for the convenience of the residents of Tirupati.

He said TTD is ready to provide all support including timely release of funds and that the builders should take all steps to maintain quality standards.

He also suggested that the TTD JEO, Chief Engineer and TMC officials should coordinate efforts and conduct frequent inspections and oversee the completion of works.

TTD FA& CEO Sri Balaji, CE Sri Nageswara Rao, EE Sri Chandrasekhar, AFCON representative Sri Swami and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

శ్రీనివాస సేతు పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2022 జులై 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికులు, నగరవాసుల సౌకర్యార్థం తిరుపతి నగరంలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల తన కార్యాలయంలో గురువారం సాయంత్రం తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం ఇతర అధికారులతో శ్రీనివాస సేతు పనుల పురోగతిపై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మంగళం రోడ్డు నుంచి లీలామహల్ సర్కిల్ అప్రోచ్ రోడ్డు పనులను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని కోరారు. లక్ష్మీపురం సర్కిల్ నుండి రామానుజ సర్కిల్ వరకు జరుగుతున్న పనులను ఆగస్టు నెలలో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రాస్ వద్ద నుండి జరుగుతున్న పనులను మూడు వారాల్లో పూర్తిచేసి నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమయానుకూలంగా నిధులు మంజూరు చేస్తున్నామని, అవసరమైతే ఇతర సహకారం కూడా అందిస్తామని తెలిపారు. జరుగుతున్న పనులను టిటిడి జెఈఓ, చీఫ్ ఇంజినీర్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి తగిన సూచనలివ్వాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఈఈ శ్రీ చంద్రశేఖర్, ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధి శ్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.