GARUDA SEVA IN SKVST ON FEB 15  _ ఫిబ్రవరి 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

TIRUPATI, 14 FEBRUARY 2023: The ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram will witness Garuda Seva on Wednesday.

TTD has made elaborate arrangements of Annaprasadam, Laddu Prasadams, Security, water distribution, sanitation etc. for the sake of devotees.

SHOBHA YATRA:

The procession of grand Lakshmi Kasula Haram will commence at Tirumala by 2pm and reach Srinivasa Mangapuram for Garuda Seva.

In the morning, Goda Malas will reach the temple at, 11am from Sri Govindaraja Swamy temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ

తిరుపతి, 2023 ఫిబ్రవరి 14: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్‌ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర :

గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి బుధవారం మధ్యాహ్నం 2గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకు వెళతారు.

శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు :

అదేవిధంగా బుధవారం ఉదయం 7 గంటలకు తిరుపతిలోని
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. నగర వీధుల్లో ఊరేగింపుగా ఉదయం 11 గంటలకు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటాయి .

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.