KAPILATHEERTHAVIBHUDU ON MAKARA _ మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

TIRUPATI, 14 FEBRUARY 2023: On the fourth day morning, as part of ongoing annual brahmotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Somaskandamurthi along with His consort Kamakshi Devi graced on Makara vahanam on the the bright sunny day.

Makara happens to be the favourite vehicle of Ganga Devi, one of the consorts of Lord Shiva. Later between 10:30am and 11:30am Snapana Tirumanjanam was performed.

Devotees offered Harati all along the path of the procession of vahanam with utmost devotion chanting “Om Namah Sivaya”.

Deputy EO Sri Devendra Babu, AEO Sri Parthasaradhi and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మకర వాహనంపై కపిలతీర్థ విభుడు

తిరుపతి, 14 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థ సారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.