SNAPANAM PERFORMED _ వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం 

TIRUPATI, 14 FEBRUARY 2023: On the fourth day, after Kalpavriksha Vahana Seva, Snapana Tirumanjanam was performed to the Utsava Murties of Sri Kalyana Venkateswara along with Sridevi and Bhudevi.

The event took place at Kalyana Mandapam in the temple premises under the supervision of Kankanabhattar Sri Balaji Rangacharyulu.

Viswaksena Aradhana, Punyahavachanam, Navakalasabhishekam, Rajopacharam were performed.

Taittireya Upanishad shlokas, Sri, Purusha, Bhu, Nila, Narayana Pancha Shanti Mantras were recited on the occasion.

Temple officials and devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం

తిరుపతి, 2023 ఫిబ్రవరి 14: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు మంగళవారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున రోజా ,సంపంగి తదితర ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్‌ రెడ్డి, ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.