POURNAMI GARUDA SEVA ON FEBRUARY 9 _ ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణమి గరుడసేవ, నాళాయిర దివ్యప్రబంధ మహోత్సవం

NALAYIRA DIVYA PRABANDHA PARAYANAM IN FRONT OF VAHANAM

 Tirumala, 3 Feb. 20: The monthly Pournami Garuda Seva will be observed at Tirumala on February 9. On this occasion, community recitation of Nalayira Divya Prabandha Parayanam will also be performed in front of Vahanam. 

The Pournami Garuda Seva will take place between 7pm and 9pm.  

There will discourses at Asthana Mandapam on Sunday morning while in the evening at 4pm, Gosthi Gabam will be performed. 

Later nearly 200 Parayanamdars will recite Nalayira Divya Prabandha Parayanam along with the procession of Garuda Vahanam under the aegis of HDPP Secretary Prof. Rajagopalan. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 9న పౌర్ణమి గరుడసేవ, నాళాయిర దివ్యప్రబంధ మహోత్సవం

 ఫిబ్రవరి 03, తిరుమల 2020:  తిరుమలలో ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ ఆదివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

నాళాయిర దివ్యప్రబంధ మహోత్సవం

శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ సందర్భంగా నాళాయిర దివ్యప్రబంధ మహోత్సవాన్ని నాలుగో సారి టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఇదివరకు వేద మహోత్సవం, భజనమేళా లాంటి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన విషయం విదితమే.

దివ్యప్రబంధ మహోత్సవంలో భాగంగా ద్రావిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు.

ముందుగా ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం, దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణం నిర్వహిస్తారు. టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరిగి దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ త‌రువాత రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయ‌ర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.