GRAND FINALE OF SRINIVASA CHATURVEDA HAVANAM AT VISAKHAPATNAM _ విశాఖ‌లో పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌నివాస చ‌తుర్వేద హ‌వ‌నం

AP CM PARTICIPATES IN PURNAHUTI

 Visakhapatnam, 3 February 2020: Srinivasa Chaturveda Havanam which was organised at Sri Sarada Peetham in Pendurthi of Visakhapatnam from January 30 concluded on Monday in which Honourable CM of AP Sri YS Jagan Mohan Reddy participated.

The pontiff of Sarada peetham Sri Sri Sri Swaroopananda and his successor Sri Sri Swathmanandandra Saraswathy supervised the five day holy event which was organized under the aegis of Hindu Dharma Prachara Parishad and Sri Venkateswara Higher Vedic Institute of TTD, in which over 100 Vedic pumdits from all over country participated.

For five days from morning  8am to 4pm Veda havanam was performed and on February 3rd the Chaturveda havanam completed at 12 noon with Purnahuti.

CULTURAL ACITIVITES

The TTD also organised variety of cultural programs by roping in popular prominent artists on all days.

Dr Akella Vibhishana Sharma, the OSD of SVHVSI supervised all programs.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 






















 
 
 
 
Attachments area
 
విశాఖ‌లో పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌నివాస చ‌తుర్వేద హ‌వ‌నం
 
తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 03: టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌న‌వ‌రి 30 నుండి ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నంలోని పెందుర్తిలో గ‌ల శ్రీశార‌దా పీఠంలో జ‌రిగిన శ్రీ‌నివాస చ‌తుర్వేద హ‌వ‌నం సోమ‌వారం పూర్ణాహుతితో ఘ‌నంగా ముగిసింది.

పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ . వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామివారు,  ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారు, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు.

శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామివారు,  ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామివారి ఆశీస్సుల‌తో లోక క‌ల్యాణం కోసం 5 రోజుల పాటు ఈ చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వ‌హించారు. 5 రోజుల పాటు ఉద‌యం 8 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వేద హ‌వ‌నం, సాయంత్రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.