IMPOSING MAHA SAMPROKSHANAM AT BHUBANESHWAR SV TEMPLE _ భువ‌నేశ్వ‌ర్‌లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

·      PLAQUE UNVEILED BY VISAKHA SARADA PEETHAMM PONTIFF SRI SRI SRI SWAROOPANANDA SARASWATI 

·      ODISHA CM, AP GUV, TTD CHAIRMAN TAKES PART

 ·      CELESTIAL AGAMIC RITUAL HELD

 Bhubaneshwar, 26 May 2022: The Maha Samprokshanam fete of the newly built Sri Venkateswara temple in Bhubaneswar was performed with celestial grandeur on Thursday. The religious event was held in the auspicious Mithuna Lagnam between 8:50am and 9:05am.

The plaque was unveiled by the Pontiff of Visakha Sarada Peetham, Sri Sri Sri Swaroopananda Saraswati Mahaswamy accompanied by the Honourable CM of Odisha Sri Navin Patnaik and AP Governor Sri Biswabushan Harichandan along with TTD Chairman Sri YV Subba Reddy.  

Earlier,  the Vedic rituals of Punyahavachanam, Agni Pranayanam, Kumbha Aradhana, Nivedana, Homam and Maha Purnahuti were performed. The Brahma Ghosha, Veda sattumora, Archaka Bahumanamere and Dwajarohanam were carried out between 11.30am and 1.30pm.

In the afternoon between 3pm and 4:30 pm Srinivasa Kalyanam fete followed by the procession of utsava idols, Dwajavarohanam will take place. In the evening, after Nitya Kaikaryams, the Ekantha Seva will be observed in the night. 

CHAIRMAN FELICITATES ODISHA CM AND AP GUV

On this momentous occasion, TTD Chairman Sri Y V Subba Reddy has felicitated the Honourable CM of Odisha Sri Navin Patnaik and the Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan and presented them Theertha Prasadams and Vastrams of Lord Venkateswara.

Visakha Sharada Peetham Junior Pontiff Sri Swatmanandendra Saraswati, TTD board member Sri Malladi Krishna Rao, Local Advisory Committee Chairman Sri Dushyant Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam,CE Sri Nageswara Rao, All Projects Officer Sri Vijayasaradhi, DyEO Sri Gunabhushana Reddy, VGO Sri Manohar, Srivari temple Chief Priest Sri Venugopal Dikshitulu, Agama Advisor Sri Vedantam Vishnu Bhattacharyulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భువ‌నేశ్వ‌ర్‌లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుప‌తి, 2022 మే 26: – శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించిన విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి, ఒడిశా సిఎం శ్రీ నవీన్ పట్నాయక్ , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

– శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు

భువ‌నేశ్వ‌ర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం 8.50 నుండి 9.05 గంటల నడుమ మిథున‌ లగ్నంలో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫ‌ల‌కాన్ని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి, ఒడిశా సిఎం శ్రీ నవీన్ పట్నాయక్ , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆవిష్క‌రించారు.

అంత‌కుముందు ఉద‌యం 5.30 నుండి 8 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్ని ప్ర‌ణ‌య‌నం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న చేశారు. ఉదయం 8.50 నుండి 9.05 గంటల మధ్య ఆగమోక్తంగా ప్రాణ ప్ర‌తిష్ట‌, మహాకుంభాభిషేకం నిర్వ‌హించారు. ఆ తరువాత బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, అర్చక బహుమానం జ‌రిగింది. ఉద‌యం 11.30 నుండి 1.30 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం నిర్వ‌హించారు.

మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి, బోర్డు సభ్యులు శ్రీ మల్లాడి కృష్ణా రావు, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా బార్గ‌వి, శ్రీ వీరబ్రహ్మం, స్థానిక సలహా మండ‌లి అధ్యక్షులు శ్రీ దుష్మంత్ కుమార్, సిఇ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.