BHOOTA VAHANA SEVA HELD _ భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి 

TIRUPATI, 13 FEBRUARY 2023: On the third day morning as a part of ongoing annual brahmotsavams in Sri Kapileswara Swamy temple, Sri Somaskanda Murty paraded along mada streets on Bhoota Vahanam.

Goddess Sri Kamakshi Ammavaru also paraded along on another Tiruchi.

Deputy EO Sri Devendra Babu and other staff and devotees were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతి, 13 ఫిబ్రవరి 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభ‌య‌మిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చారు.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థ సారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.