UGADI ASTHANAM ON MARCH 22 _ మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

NO VIP BREAK DARSHAN ON MARCH 21 AND 22

TIRUMALA, 11 MARCH 2023: On the auspicious day of Chaitra Suddha Padhyami on March 22, Ugadi Asthanam will be observed in Tirumala temple.

In connection with Ugadi on March 22, the traditional temple cleansing festival Koil Alwar Tirumanjanam will be performed on March 21.

As such, TTD has cancelled all the Arjita Sevas on the day of Ugadi.

While TTD has also cancelled VIP Break Darshan on March 21 and 22, owing to Koil Alwar Tirumanjanam and Ugadi respectively. As such, no recommendation letters for VIP Break darshan will be accepted on March 20 and 21.

The devotees are requested to make note of this and cooperate with TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

– మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

– మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

తిరుమల, 2023 మార్చి 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేసింది.

మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు :

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.

ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.