మార్చి 22 నుండి 28వ తేదీ వరకు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మార్చి 22 నుండి 28వ తేదీ వరకు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మార్చి 21, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 22 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మార్చి 22వ తేదీ రాత్రి 7.00 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం
23-03-13(శనివారం) ధ్వజారోహణం(వృషభలగ్నం) కల్యాణోత్సవం
24-03-13(ఆదివారం) తిరుచ్చి ఉత్సవం గరుడవాహనం
25-03-13(సోమవారం) తిరుచ్చి ఉత్సవం ఊంజల్‌సేవ
26-03-13(మంగళవారం) తిరుచ్చి ఉత్సవం ఊంజల్‌సేవ
27-03-13(బుధవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
28-03-13(గురువారం) ———— పుష్పయాగం

మార్చి 23వ తేదీ శనివారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల మధ్య స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక అంగవస్త్రం, రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.