PURCHASE OF QUALITATIVE RICE FROM MILLERS _ మిల్లర్ల నుంచి నాణ్యమైన బియ్యం కొనుగోలు- అన్నప్రసాదం నాణ్యత మరింత పెంచేందుకు పాత విధానం ఆలోచన- టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

TIRUPATI, 18 APRIL 2023: With a noble intention to provide more qualitative and tastier Annaprasadam to the devotees, TTD is contemplating to purchase the rice directly from Rice Millers, said TTD EO Sri AV Dharma Reddy.

 

A review meeting was held with Andhra Pradesh and Telangana Rice Millers Associations at Sri Padmavathi Rest House in Tirupati on Tuesday. Speaking on the occasion, the EO said, TTD purchased Massora Rice from the AP and TS Rice Millers from 2013 to 2019 for its Annaprasadams. However, in 2019, the TTD board has decided to purchase rice through tenders. With this the merchants have been purchasing rice from millers and supplying them to TTD. But by purchasing the rice directly from millers, more qualitative products can be procured. So we are contemplating the same”, he added. 

 

Upon the instructions of TTD Trust Board Chairman Sri YV Subba Reddy, we have now organised a review meeting with the rice millers of both the Telugu states. The Rice Millers have agreed to supply the rice within a week’s time. Of late, the devotees have complained about the quality of rice served in Annaprasadam. We are at present purchasing the rice for Rs.38 per kilo from merchants through tenders. To purchase Go Adhrita products, TTD has inked a pact with AP Markfed and RySS also”, he added.

 

JEO (H&E) Smt Sada Bhargavi, DyEOs Sri Selvam, Smt Padmavati, GM(Procurement) Sri Subrahmanyam, Catering Special Officer Sri Shastry, other staff, a representative from Rice Millers Association of both the Telugu states were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

మిల్లర్ల నుంచి నాణ్యమైన బియ్యం కొనుగోలు

– అన్నప్రసాదం నాణ్యత మరింత పెంచేందుకు పాత విధానం ఆలోచన

– టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుమల, 2023 ఏప్రిల్ 18: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్న ప్రసాదాలు అందించడానికి మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం ఈవో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ అన్నప్రసాదాలకు, ఇతర అవసరాలకు 2013 నుండి 2019వ సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుండి నాణ్యమైన సోనా మసూర బియ్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2019 లో ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా బియ్యం కొనుగోలు చేయడం వల్ల వ్యాపారస్తులు, మిల్లర్ల వద్ద కొని టీటీడీకి సరఫరా చేస్తున్నారన్నారు. టీటీడీ నేరుగా రైస్ మిల్లర్ల వద్ద కొనుగోలు చేయడం వలన మరింత నాణ్యమైన బియ్యం అందుతాయని ఆయన చెప్పారు.
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అన్న ప్రసాదాలను మరింత రుచికరంగా అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మిల్లర్లు వారం రోజుల్లో బియ్యం సరఫరా రేటు తెలియజేస్తామని చెప్పినట్లు తెలిపారు.

ఇటీవల టీటీడీ అన్నప్రసాదంలో బియ్యం బాగాలేవని భక్తుల నుండి ఫిర్యాదులు అందాయన్నారు. ప్రస్తుతం టెండర్ ద్వారా వ్యాపారస్తులు రూ.38 రూపాయలకు కేజి బియ్యం అందిస్తున్నారని ఈవో వివరించారు.

గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఏపి మార్క్ ఫెడ్లతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, డిప్యూటీ ఈవోలు శ్రీ సెల్వం, శ్రీమతి పద్మావతి, జిఎం (కొనుగోలు) శ్రీ సుబ్రహ్మణ్యం జి ఎం ప్రాక్యూర్మెంట్, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.