VENGAMAMBA JAYANTHI UTSAVAMS CONCLUDES _ ముగిసిన వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు

TIRUPATI, 15 MAY 2022: The two-day literary event in connection with the 292nd Jayanthi of Matrusri Tarigonda Vengamamba concluded in Tirupati on Sunday.

 

As part of it, floral tributes were paid to Vengamamba statue located in MR Palle Circle by All Projects Program Officer Sri Vijayasaradhi.

 

Later Sahiti Sadas commenced at Annamacharya Kalamandiram in Tirupati.

 

Scholars Sri Malayavasini from Visakhapatnam, Dr Nagarajya Lakshmi from Guntur spoke on the great works and life of Vengamamba presided over by Sri Krishna Reddy.

 

In the evening devotional cultural programme were performed.

 

In Tarigonda, the native place of Vengamamba, Sri Lakshmi Narasimha Kalyanam was observed.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు
 
విగ్రహానికి పుష్పాంజలి
 
ఆకట్టుకున్న సాహితీ సదస్సు, సంగీత సభ
 
తిరుపతి, 2022 మే 15: తిరుపతిలో రెండు రోజులపాటు జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి.
 
ఇందులో భాగంగా ఉదయం తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి  శ్రీ విజయసారథి పుష్పాంజలి సమర్పించారు. 
 
అనంతరం అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితీ సభ ప్రారంభమైంది. సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఎస్.కృష్ణారెడ్డి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – సంచార క్షేత్రాలు” అనే అంశంపై ఉపన్యసించారు. వెంగమాంబ ప్రధానంగా తన జన్మస్థలమైన తరిగొండ, ఆ తరువాత తిరుమలలో ప్రధానంగా సంచరించారని తెలిపారు. తరిగొండలో 5, తిరుమలలో 13 కలిపి మొత్తం 18 రచనల ద్వారా స్వామివారి కీర్తిని ఇనుమడింపచేశారని తెలిపారు. వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు.
 
విశాఖపట్టణానికి చెందిన ఆచార్య కె.మలయవాసిని “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనలు – భక్తితత్వం” అనే అంశంపై ఉపన్యసిస్తూ వెంగమాంబ వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. 
 
గుంటూరుకు చెందిన డా|| వి.నాగరాజ్యలక్ష్మి  ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహత్యం” అనే అంశంపై మాట్లాడుతూ శ్రీవేంకటాచల మహత్యం గ్రంథంలో శ్రీవారి కల్యాణఘట్టాన్ని సరళంగా, సుందరంగా భక్తులకు అందించారని చెప్పారు. వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు.
 
సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చెందిన కుమారి కె.లక్ష్మీరాజ్యం, శ్రీ లోకనాథరెడ్డి బృందం సంగీత సభ జరుగనుంది.
 
ఈ కార్యక్రమంలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, భక్తులు పాల్గొన్నారు.
 
తరిగొండలో…
 
తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆ తరువాత సంగీత, హరికథ కార్యక్రమాలు నిర్వహించారు.
    
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.