VASANTOTSAVAM COMMENCES _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 15 MAY 2022: Annual Vasanthotsavams commenced on a grand religious note in Tiruchanoor on Sunday.

 

Snapana Tirumanjanam was observed to the processional deity of Goddess Padmavati Devi at Friday Gardens.

 

Temple DyEO Sri Lokanatham and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
 
మే 16 న స్వర్ణరథోత్సవం
 
తిరుపతి, 2022 మే 15: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. మే 16న ఉదయం 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
 
వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.
 
వైభవంగా స్నపనతిరుమంజనం
 
వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం  అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
 
గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. వసంతోత్సవం కార‌ణంగా ఆదివారం క‌ల్యాణం, ఊంజ‌ల్‌సేవ ర‌ద్ద‌య్యాయి.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ దామోదరం పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.