NAVARATRI FESTIVITIES CONCLUDE AT SRI PAT _ ముగిసిన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి నవరాత్రి ఉత్సవాలు

Tiruchanoor, 26 Oct. 20: The ten day Navaratri festivities conducted at Sri Padmavati ammavari temple, Tiruchanoor concluded on Monday evening.

The festivities including daily alankaras and Snapana thirumanjanam at Sri Krishna Mukha Mandapam were held in ekantham inside temple in view of COVID-19 guidelines.

The last day festivities of Snapana thirumanjanam was held at 2.30 Pm and grand Gaja vahanam was held in the evening.

   Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramaniam, Superintendent Sri Kumar, Arjita inspector Sri Rajesh Kanna, Vahana inspector Sri Purushottam Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముగిసిన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి నవరాత్రి ఉత్సవాలు
 
అక్టోబ‌రు 26, తిరుప‌తి 2020: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ది రోజుల పాటు జ‌రిగిన నవరాత్రి ఉత్సవాలు సోమ‌వారం ముగిశాయి. కోవిడ్‌-19 నిబంధ‌ల కార‌ణంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
 
చివ‌రి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనం‌తో విశేషంగా అభిషేకం  చేశారు. అనంత‌రం రాత్రి 7 గంట‌లకు గజ వాహనసేవ ఏకాంతంగా జ‌రిగింది. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ కుమార్‌, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా, వాహ‌నం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ పురుషోత్తంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.