EO DIRECTS OFFICIALS TO FOCUS ON DEVOTEES FEEDBACK _ యాత్రికుల ఫీడ్ బ్యాక్ పై ప్రత్యేక దృష్టి అధికారులకు ఈఓ ఆదేశం

Tirupati, 18 Nov. 20: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Wednesday directed officials to focus attention on suggestions and appeals made by devotees with regard to devotee welfare services of TTD through emails, call centres, Dial-Your- EO programs.

During IT review meeting held at TTD building auditorium the TTD EO instructed them to strengthen the Information Technology applications in TTD and also complete the pending software updating in all departments.

He directed for preparing a new App on market intelligence for monitoring prices to make purchases for all TTD departments.

The TTD EO also wanted the completion of IT adaptation in the civil engineering department and a separate App for hospitals management and an App to send an alert message to all tenants of TTD to make rental payments.

He asked the officials to update data on the employees welfare activities and also take up digitisation of all records.

Earlier the CVSO Sri Gopinath Jatti made a power point presentation on the cyber security policy of TTD.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, FACAO Sri O Balaji, Chief Engineer Sri Ramesh Reddy, Chief of IT Sri Shesha Reddy and others present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

యాత్రికుల ఫీడ్ బ్యాక్ పై ప్రత్యేక దృష్టి అధికారులకు ఈఓ ఆదేశం

తిరుపతి, 18 నవంబరు 2020: టీటీడీ యాత్రికులకు అందిస్తున్న సేవలు, పాలన వ్యవహారాలకు సంబంధించి మెయిల్స్, కాల్ సెంటర్, డయల్ యువర్ ఈఓ ద్వారా వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదుల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఈఓ డాక్టర్ కెఎస్‌.జ‌వహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఆయన ఐటి విభాగంపై అధికారులతో   సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ విభాగాలకు సంబంధించి పెండింగులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహణలో ఐటి పరిజ్ఞానాన్ని మరింతగా పెంచడంపై దృష్టి పెట్టాలని ఈఓ సూచించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ప్రత్యేక అప్లికేషన్ తయారు చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో సరుకుల ధరలు, డిమాండ్, సరఫరాకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని, ఇందుకు తగ్గట్టు సరుకులు కొనుగోలు చేయగలిగేలా ఒక అప్లికేషన్ రూపొందించాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక అప్లికేషన్ ఉండాలన్నారు. టీటీడీకి అద్దెలు చెల్లించాల్సిన వారికి గడువుకు ముందే అలర్ట్ మెసేజ్ పంపే వ్యవస్థ అమలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్త సమాచారంతో టీటీడీ నిర్వహిస్తున్న డేటా అప్డేట్ చేయాలని ఆయన చెప్పారు. రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ మీద సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ స‌మావేశంలో అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సీఎఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి తో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది