TTD RELEASES BUDGET FOR Rs.4411CR FOR THE YEAR 2023-24 _ రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్ 

CONSIDERABLE HUNDI REVENUE INCREASE POST COVID-TTD CHAIRMAN 

 

VIRTUAL SEVAS TO CONTINUE

 

APPEALS VIPs TO REDUCE REFERRALS DURING SUMMER VACATION

 

SRIVANI QUOTA ALSO TO BE REDUCED FOR THE SAKE OF COMMON PILGRIMS

 

TIRUMALA, 22 MARCH 2023: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy released annual budget for the financial year 2023-24 at Rs. 4411.68 crores.

 

During the media conference held at Annamaiah Bhavan in Tirumala on Wednesday, the Chairman extending Telugu Ugadi greetings to devotees said that the TTD board has approved for Ra. 4411.68crores.

 

The Chairman said due to the MLC elections code, the outcome of the proceedings during the TTD Trust Board meeting held on February 15 were not disclosed to media. He briefed on the various development activities approved by TTD board.

Post Covid the revenue of Hundi has increased in an incredible manner and during last year the Hundi collections stood at around 1500 crores as against Rs.1200 crores before Covid.

 

Similarly, the virtual sevas during Covid period and also the interests on bank deposits post covid have impacted on the revenue collections,  he opinioned.

 

He said the Honourable CM of AP Sri YS Jagan Mohan Reddy will inaugurate the Srinivasa Setu after the final phase of works which are almost nearing completion.

On April 5, in connection with the state festival of Sri Sita Rama Kalyanam, the Honourable CM will present silk vastrams on behalf of the State Government.

 

Nod given to lay road between Alipiri to Vakulamata temple

 

Among others he said the as the summer pilgrim rush is set to increase in April, May and June, the VIPs are requested to reduce their referrals and enable more common pilgrims to have darshan.

 

The Chairman said the VIP break darshan timings will continue as such since over 95% of common pilgrims had given thumbs up to the existing method which has drastically reduced the waiting hours of darshan for general devotees and also decreased the pressure on accommodation.”We are also contemplating to reduce the SRIVANI tickets during these three months to enable more darshan time for common pilgrims”, he said.

 

Some excerpts on development activities :

 

30 more additional counters in Laddu Complex at Rs. 5.25cr to avoid delay of distribution of laddus in Laddu Complex.

 

Rs. 4.70 crores towards the construction of Sri Venkateswara Swamy temple at Ulundurpeta in Tamilnadu.

 

Towards the development of SGS Arts College in Tirupati at Rs. 4.71 crores. The works includes the modernisation of the Library, Third Floor, Indoor Sports Complex, etc. for which tenders are called for

 

The employees of SLSMPC are also given ID cards and laddu cards on subsidy along with darshan for their families

 

JEO for Health and Education Smt Sada Bhargavi, SE2 Sri Jagadeeshwar Reddy were also present.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రూ 4,411.68 కోట్లతో టీటీడీ 2023-24 బడ్జెట్

– కోవిడ్ తరువాత గణనీయంగా పెరిగిన హుండీ ఆదాయం, బ్యాంకు వడ్డీ రేట్లు

– వర్చువల్ సేవలను కొనసాగిస్తాం

– వేసవిలో మూడు నెలలు
వి ఐ పి లు రెఫరల్స్ లెటర్లు తగ్గించాలి

– సామాన్య భక్తుల దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడాకుదిస్తాం

– టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 22 మార్చి 2023: 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ
ఎ వి ధర్మారెడ్డి తో కలసి బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.


– శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వామి వారి దయ, ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను.

– ఫిబ్రవరి నెల 15వ తేదీ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించిన విషయం అందరికీ తెలుసు.

– ఈ సమావేశంలో 2023-24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది.

– ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను వెల్లడించలేక పోయాము.
– కోడ్ ముగిసినందువల్ల ఈ రోజు మీడియా ద్వారా వివరాలు తెలియజేయడం జరుగుతోంది.

– వి ఐ పి బ్రేక్ దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం.

– కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి.

– భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్ లో జారీ చేశాము. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించాము.

– తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

– అలిపిరి నుండి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాము.

– ఏప్రిల్ 5వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

– వేసవిలో మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వి ఐ పి ల రెఫరల్స్ బాగా తగ్గించాలని కోరుతున్నాము. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాము.

– తిరుమల లో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేశాము.

– తమిళనాడు రాష్ట్రం ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించాము.

– తిరుపతి లోని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల పడమరవైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశాము.

– శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మీడియా సమావేశంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, యెస్.ఈ జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది