SIMHA VAHANA SEVA HELD _ సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం 

TIRUPATI, 22 MARCH 2023: On the third day morning, Simha Vahana Seva was held in Sri Kodandaramalayam as a part of the ongoing annual brahmotsavams.

The bright sunny day on Wednesday witnessed Sri Ramachandra Murthy seated on the ferocious King of the Jungle and took out a celestial ride along four mada streets to bless the devotees converged on streets to catch a glimpse of the dazzling deity on the Simha Vahana.

Deputy EO Smt Nagaratna, AEO Sri Mohan and other temple officials, devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం
 
తిరుపతి, 2023 మార్చి 22,: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక  బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది.
 
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం.  ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి . సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
 
వాహనసేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. 
 
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
 
వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ మోహన్, కంకణ బట్టర్ శ్రీ ఆనంద కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.