వివరణ

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
 వివరణ

తిరుపతి, 2010 అక్టోబర్ 26 : అక్టోబర్‌ 25వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ”విఐపి బ్రేక్‌ దర్శనాలలో నిబంధనల సడలింపు”, ”విచక్షణ కోటాలో మళ్ళీ బ్రేక్‌ దర్శనం టికెట్ల వెల్లువ” అని ప్రచురించిన వార్త పూర్తిగా నిరాధారం.

శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విషయంలో నిబంధనలకు నీళ్ళు వదులుతున్నారని, శుక్ర,శని, ఆదివారాలలో రాత్రిపూట విఐపి బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తున్నారని వ్రాసిన వార్త వాస్తవదూరం. అంతేగాకుండా టిటిడిలో తమ పదవులు పదిలం చేసుకోవడానికి విఐపిలకు ప్రత్యేక హారతులు ఇస్తున్నారని వ్రాయడం కూడా బాధాకరం.

శుక్ర,శని, ఆదివారాలలో బ్రేక్‌దర్శనాలు రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజులలో ప్రత్యేక దర్శనాలు చేయిస్తున్నారని వ్రాయడం సరికాదు.

కనుక ఈ విషయాన్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.  

ప్రజాసంబంధాల అధికారి

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి