Donation of Land to TTD by Smt. Girija Pandey & Ms. Kanchana  _ శ్రీ‌వారికి చెన్నైలో భ‌వ‌నాలు విరాళం

Tirupati, 25 Oct. 10: Smt. Girija Pandey and Ms. Vasundara Devi @ Kanchana has donated Rs. 15 crores worth land at Chennai to Tirumala Tirupati Devasthanams on Monday.  They have handed over the registered documents of the land to Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs at his bungalow in Tirupati.

The land and building are located in G.N.Chetty street in Chennai. Further they have requested the TTD EO to construct Kalyana Mandapam / Community Hall.

Dr. N.Yuvaraj, Joint Executive Officer, TTDs, Sri Seshaiah, Estate Officer were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

శ్రీ‌వారికి చెన్నైలో భ‌వ‌నాలు విరాళం

తిరుపతి, 2010 అక్టోబర్‌ 25 : చెన్నైకి చెందిన గిరిజాపాండే, వసుంధరాదేవి (అలియాస్‌ కాంచన) అను భక్తులు చెన్నైలోని జి.యన్‌.శెట్టి వీధిలో 15 కోట్ల రూపాయల విలువకలిగిన స్థలాన్ని (కొన్ని భవనాలతో కలిపి) తితిదేకి విరాళంగా ఇచ్చారు. సోమవారం సాయంత్రం వారు తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావును కలిసి సదరు భూమికి సంబంధించిన రిజిష్టర్డు డాక్యుమెంట్స్‌ను అందజేశారు.

ఈసందర్భంగా సదరు భూమిలో భక్తులకు ఉపయోగపడే విధంగా కళ్యాణమండపము, కమ్యూనిటిహాల్‌ని  నిర్మించాలని వారు ఇఓని కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే జెఇఓ డాక్టర్‌ యన్‌. యువరాజ్‌, తితిదే ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.