GEMOLOGY EXPERTS CERTIFY LORD’S JEWELS AS CENT PERCENT PURE _ శ్రీవారి ఆభరణాల నాణ్యతను పరిశీలించిన జెమాలజీ నిపుణుల కమిటీ
TIRUPATI, OCTOBER 26: A team of Gemology experts certified that all the diamond and precious stones studded jewels in the Srivari temple are genuine and authentic.
Disclosing the verification reports to the media persons at Annamaiah Bhavan in Tirumala on Tuesday, Sri. Rajiv Jain, the Chairman of Gems and Jewelry Export Promotion Council of India said a Gemology committee has been constituted comprising expert gemologists from Surat, Jaipur and Mumbai, over the request of TTD.
Verification of the diamonds for its caratage and purity with the help of a fully equipped lab set-up is not difficult. But, we have used the verification process with the help of a Portable Raman Spectrometer, for the first time in the country by setting up the instrument inside the temple”, Sri. Jain said.
“Our experts worked hard for eight weeks from 7am till midnight to verify the size, colour, quality, purity of the diamonds and other precious gems studded 346 jewels of Lord Venkateswara, which became possible only with the support and co-operation of TTD officials”, Sri.Jain said.
Sri Nitin Pachigar, ex-Committee member and convener of colour stones, Sri. Mehul Durlabhji, chairman Gem testing laboratory, Dr.Shastry, Research scientist, GII Mumbai, Sri K.T.Ramachandran, chief Gemologist, GII Mumbai, Sri.Gagan Chowdary, chief Gemologist, GTL Jaipur, Sri Sameer Mehta JTAC member, Mumbai, Additional Financial Advisor and Chief Accounts officer of TTD Sri O.Balaji, Deputy EO Temple, Sri Gopala Krishna, EDP manager Sri Bhasker and other are also present.
Later while interacting with media persons, TTD EO, Shri IYR Krishna Rao said that the verification of Srivari diamond and precious stones studded jewels began on February 2009. “In Tiruvabharanam and Jadthi registers about 1100 jewels comprising gold, silver, precious and diamond studded have been recorded. Out of them the gemology experts committee verified 346 exclusive diamond and precious gem studded jewels of Lord and certified them as 100% pure”, Mr.Rao said. Later EO said that a Gemology lab will soon come up in the TTD administrative building at Tirupati in the Treasury section. Mr. Rao also said that the jewels of other TTD-related sub shrines will also be verified.
Earlier the Gemology experts have handed over a detailed report about the purity of diamonds and precious gems studded jewels of Lord Venkateswara to TTD EO, Sri IYR Krishna Rao at his camp office at Tirumala on Tuesday.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI.శ్రీవారి ఆభరణాల నాణ్యతను పరిశీలించిన జెమాలజీ నిపుణుల కమిటీ
తిరుమల, 2010 అక్టోబర్ 26: తిరుమల శ్రీవారి ఆలయంలో వున్న స్వామివారి వివిధ ఆభరణాల నాణ్యతను పరిశీలించేందుకై ఏర్పాటుచేసిన జెమాలజీ నిపుణుల కమిటీ తితిదేకి తమ నివేదికను మంగళవారం అందజేసింది.
ఈ సందర్భంగా స్థానిక అన్నమయ్య భవన్‌లో జెమాలజీ నిపుణుల కమిటీ చైర్మన్ శ్రీరాజీవ్‌జైన్ మీడియాతో మాట్లాడుతూ 2010, ఫిబ్రవరి నెలలో ఈ కమిటీని తితిదే ఏర్పాటు చేసిందని, ఈ కమిటీలో జాతీయస్థాయి జెమాలజీ నిపుణులున్నారని వీరందరూ కలసి స్వామివారు ఆభరణాలు పరిశీలించినట్లు ఆయన చెప్పారు. శ్రీవారి ఆలయంలోని తిరువాభరణం, జెట్టీ రిజిష్టర్లలో పొందుపరచిన దాదాపు 1100 ఆభరణాల సంఖ్యలో 346 వజ్ర, వైడూర్యాలకు సంబంధించినవి గనుక, వాటిని మాత్రమే ఈ కమిటీ పోర్టబుల్ రామన్ స్పెక్ట్రామీటర్‌తో నిశిత పరిశీలన జరిపిందని, తమ పరిశీలనలో స్వామివారి ఆభరణాల (వజ్ర, వైడూర్యాలు) కు సంబంధించి మొత్తం నాణ్యతను కల్గివున్నాయని వారు తెలిపారు.
ఈ సమావేశంలో జెమాలజీ కమిటీ సభ్యులు శ్రీనితిన్ పచ్చిగార్, శ్రీముహుల్ దుర్భాజి, శ్రీశాస్త్రి, శ్రీ కె.టి.రామచంద్ర, శ్రీ గగన్ చౌదరి, శ్రీ సమీర్‌మెహతా, తితిదే అదనపు ముఖ్య గణాంకాధికారి శ్రీ ఓ.బాలాజీ, ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తితిదే ఇఓ శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జెమాలజీ నిపుణుల కమిటీ శ్రీవారి ఆభరణాల
తితిదే పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలోను ఒక జెమాలజీ ల్యాబ్‌ను నెలకొల్పి, ఖజానాలో వున్న ఆభరణాలు, అదేవిధంగా స్థానికాలయాలలోని ఆభరణాల నాణ్యతను కూడా పరిశీలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
పిదప ఇఓ తిరుమలలోని జి.యన్.సి. లగేజి సెంటర్, గీతోపదేశం పార్కు, జి.ఎన్.సిలోని కాటేజీల నిర్వహణ, కాషన్ డిపాజిట్‌కౌంటర్ల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలుసూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే జె.ఇ.ఓ. శ్రీ జె. భాస్కర్, ముఖ్య భద్రతాధికారి శ్రీ యం.కె. సింగ్, ఆర్థిక సలహాదారు శ్రీ భాస్కర్‌రెడ్డి, ఎస్.ఇ-2 శ్రీ రమేష్‌రెడ్డి, రిసెప్షన్ అధికార్లు శ్రీ లక్ష్మీకాంతం, భూపతిరెడ్డి, చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.