వివరణ_ ”భలే మంచి చౌకబేరము” అనే వార్తకు వివరణ

వివరణ

”భలే మంచి చౌకబేరము” అనే వార్తకు వివరణ

విషయం :- 15-3-09తేదిన ”వార్త” పత్రికలో ”భలే మంచి చౌకబేరము” అనే శీర్షికతో ప్రకటించిన వార్తకు వివరణ.

      ఈ వార్త కథనం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం. తిరుపతి రూయా ఆసుపత్రికి వచ్చే పేద, మధ్య తరగతి రోగులకు, వారి బంధువులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం తక్కువ ధరకే అందించడానికి క్యాంటిను అద్దెను కేవలం రూ.550 రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది. భోజనాలకు సంబందించిన ‘మెనూ’ ను కూడా దేవస్థానమే నిర్ణయించి,టెండరు ప్రకటన యివ్వడం జరిగింది. కాని మొదటి సారి టెండరులో స్పెషలు భోజనం రూ.25 మరియు ఫుల్‌ భోజనం రూ.24లకు సరఫరా చేస్తామని టెండరుదారులు తెలిపారు. ఈ రేట్లు ఎక్కువగా యున్నాయని, పేద తరగతికి చెందిన రోగులు వీటిని బరించలేరని తితిదే భావించి వాటిని రద్దు చేయడం జరిగింది. రెండవసారి ప్రకటించిన టెండరులో శ్రీయస్‌.తంబిరెడ్డి అనే వ్యక్తి స్పెషలు భోజనం 13 రూపాయలకు, ఫుల్‌ భోజనం 15 రూపాయలకే సరఫరా చేస్తానని తెలిపారు.

నిబంధనల ప్రకారం, తక్కువ ధరకు టెండరు వేసిన వ్యక్తికే క్యాంటినును కేటాయించడం జరిగింది. ఈ వివరణను వార్తా పత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని కోరుచున్నాము.

తి.తి.దే, ముఖ్య ప్రజాసంబందాధికారి
కె.రామపుల్లారెడ్డి