శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 506వ వర్ధంతి మహోత్సవాలు

శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 506వ వర్ధంతి మహోత్సవాలు

తిరుపతి మార్చి-12, 2009: శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 506వ వర్ధంతి మహోత్సవాలు మార్చి 23వ తేది నుండి 29వ తేది వరకు 7 రోజుల పాటు తిరుపతి,తిరుమల,తిరుచానూరు, తాళ్ళపాక, దేవుని కడపలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మార్చి 23వ తేదిన ఉదయం అలిపిరి వద్ద మెట్లోత్సవం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 23వ తేదిన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో, ఆస్థానమండపంలోను, మార్చి 23 నుండి 29 వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియం నందు, తాళ్ళపాకలోని ధ్యానమందిరం నందు, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, మార్చి 23 నుండి 25 వరకు తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం ఆస్థానమండపం నందు, మార్చి 27 నుండి 29 వరకు దేవుని కడపనందు ఈ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణలో మార్చి 29వ తేదిన ఉదయం 8గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి ఆస్థానం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్ట్‌, ధర్మప్రచార పరిషత్‌లచే భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.