NO REVIVAL OF SPECIAL DHARSHAN FACILITIES FOR SENIOR CITIZENS, CHALLENGED AND PARESNT WITH INFANTS YET, SAYS TTD _ వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పున‌రుద్ధ‌రించ‌లేదు : టిటిడి

Tirumala, 19 Oct. 21: TTD on Tuesday reiterated that there was no scope for revival of special Darshan facilities for senior citizens, challenged persons and parents with infants in view and of continued pandemic Covid environment in the country.

TTD said in a statement that special Darshan facilities for above category of devotees has been cancelled since March 20, 2020 onwards in view of ongoing pandemic covid conditions.

However some fake and baseless reports are being trolled on social media about alleged revival of   Special Darshan facilities for above categories of devotees leading to devotees from far-flung regions to land in Tirupati and face hardships.

TTD appealed to devotees to note that once the pandemic Covid environment is resolved the TTD will intimate all about revival of such Darshan facilities for the special categories.

TTD urged devotees to await official announcements and not trust the fake reports made by social media trolls, till then. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పున‌రుద్ధ‌రించ‌లేదు: టిటిడి

తిరుమల, 2021 అక్టోబ‌రు 19: కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువ‌ల్ల వీరి ద‌ర్శ‌నాల విష‌యంలో ఇదే స్థితి కొన‌సాగుతోంది.

అయితే గ‌త కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో తిరుమ‌ల‌లో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవాస్త‌వ స‌మాచారం ట్రోల్ అవుతోంది. అనేకమంది ఇది నిజ‌మ‌ని న‌మ్మి తిరుపతికి వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది. భ‌క్తులు ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చాక ఈ ద‌ర్శ‌నాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై త‌గిన నిర్ణ‌యం తీసుకుని మీడియా ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అవాస్త‌వ స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి కోరుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.