PAVITROTSAVAMS AT TTD TEMPLES IN YSR KADAPA DISTRICT _ వైఎస్ఆర్ కడప జిల్లాలోని టిటిడి ఆనుబంధ ఆలయాల్లో పవిత్రోత్సవాలు

Tirupati, 2 Sep. 21: TTD is organizing the holy Pavitrotsavam celebrations at Vontimitta, Tallapaka, Jammalamadugu and Devuni Kadapa temples in Ekantam in view of COVID guidelines in the month of September.

AT VONTIMITTA:

At the Sri Kodandarama Swamy temple, the Pavitrotsavam will be observed from September 7-9.

AT THALLAPAKA

At the Sri Chennakeshava temple, Ankurarpanam is held on September 10, Pavitra Pratista on 11, Samarpana on 12 and Maha Purnahuti on 12 followed by procession within temple premises in the evening.

 AT JAMMALAMADUGU

At Narapura Venkateswara temple Ankurarpanam will be held on September 15 evening, Pavitra Pratista on 16, Pavitra Samarpana on 17, and Maha Purnahuti On 18 followed by the procession of Swamy and Ammavari utsava idols within temple Corridors.

AT DEVUNI KADAPA

At the Sri Lakshmi Venkateswara temple Viswaksena puja and Ankurarpanam is held on September 17, Pavitrotsavams from September 18-20.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైఎస్ఆర్ కడప జిల్లాలోని టిటిడి ఆనుబంధ ఆలయాల్లో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 02: వైఎస్ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం, తాళ్ళ‌పాక శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి ఆల‌యం, జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో సెప్టెంబరు మాసంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆయా ఆల‌యాల్లో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఒంటిమిట్ట …..

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 6వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 7వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 8న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 9న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.

తాళ్ళ‌పాక‌ …..

తాళ్ళ‌పాక‌ శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 11వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 12న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 13న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగించ‌నున్నారు.

జమ్మలమడుగు….

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 15వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు 16వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి జరుగనున్నాయి. చివరిరోజు సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆల‌యంలో ఊరేగించ‌నున్నారు.

దేవుని కడప….

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 17వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబరు 18వ తేదీన పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి, పవిత్రవితరణ, ఆల‌యంలో ఊరేగింపు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది