TIRUMALA REVERBERATES TO THE RHYTHMIC RECITATION OF BALAKANDA SHLOKAS _ బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన స‌ప్త‌గిరులు

FIRST AND SECOND SARGAS RECITED IN THE FIRST PHASE OF AKHANDA BALAKANDA PARAYANAM

 

TIRUMALA, 02 SEPTEMBER 2021:  The first phase of Akhanda Balakanda Parayanam was held with utmost devotion with the Vedic pundits and devotees reciting all the shlokas from the first and second sargas of Valmiki Ramayana at the Nada Neerjana Mandapam on Thursday.


Seeking the divine intervention for the well-being of the entire humanity, TTD has been organizing Maha Mantra Parayanam at Nada Neerajanam platform since April last. As part of this, Sundarakanda, Yuddhakanda Parayanams have already been completed. Balakanda Parayanam was commenced by TTD from July 25 onwards. 

 

Under the supervision of SV Vedic University Scholar Sri Prava Ramakrishna Somayajulu, Dr K Ramanujacharyulu, Sri Indrakanti Satya Kishore rendered the Shlokas from Balakanda. A total of 143 Shlokas were recited which includes 100 from first sarga and 43 from second. The TTD’s SV Bhakti Channel has telecasted live the entire programme between 7am and 9am. 

 

At the beginning of the programme, Dr Vandana, music professor of SV College of Dance and Music along with her team, presented Nama Ramayanam penned by sage Valmiki depicting the entire story of Ramayana in a song and at the end with Sri Hanuman Jaya Hanuman bhajan.

 

TTD Additional EO Sri AV Dharma Reddy, Agama Advisor Sri Mohanarangacharyulu, Temple OSD Sri P Seshadri were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన స‌ప్త‌గిరులు

 తిరుమల, 2021 సెప్టెంబర్ 02: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని ప్ర‌థ‌మ‌, ద్వితీయ సర్గల‌లో ఉన్న మొత్తం 143 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో స‌ప్త‌గిరులు మార్మోగాయి.

బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ చిన్న పిల్ల‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని ప్ర‌భుత్వాలు, వైద్య సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వ‌ర్గ‌లవారు సుఖ‌శాతంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సర్గల్లోని మొత్తం 143 శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మ‌రి నివార‌ణ మంత్ర పారాయ‌ణం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌న్నారు. దీనిని పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం, సుఖం, శాంతి, విద్యా, ఐశ్వర్యం సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.

ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు పర్యవేక్షణలో డా.కోగంటి రామానుజాచార్యులు, శ్రీ ఇంద్ర‌కంటి స‌త్య కిషోర్ పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ” రామరామ జ‌య రాజ రామ్‌…..రామ‌రామ జ‌య సీతా రామ్ … “, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో, ” శ్రీ హ‌నుమాన్ జ‌య హ‌నుమాన్ జ‌య జ‌య క‌పివ‌ర బ‌హుబ‌ల‌వాన్ …….” అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌నరంగాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.