GRAND PROCESSION OF ANDAL GARLANDS _ వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు 

Tirupati, 18 Feb. 20: Ahead of the high voltage Garuda vahanam in the evening as a part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram, Andal Sri Goda garlands reached the temple in a procession from Sri Govindarajaswamy temple on Tuesday afternoon.

The holistic garlands are to adorn the utsava idols for the prestigious Garuda Vahana Seva in the evening.

Both the pontiffs of Tirumala, Sri Sri Sri Pedda Jeeyangar and Chinna Jeeyangar Swamis, Special Grade DyEO Smt Varalakshmi, temple DyEO Sri Yellappa and other employees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు 
 
తిరుపతి,  2020 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం రాత్రి 8.00 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. 
 
గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించే ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.
 
భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నది. 
       
అనంతరం అర్చకులు శాస్రోక్తంగా ఆండాళ్‌ అమ్మవారి మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. అనంతరం రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారి 
అలంకరించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి, స్థానిక ఆలయాల ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ ఏల్ల‌ప్ప, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య, ఇతర ఉన్నతాధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
ఫిబ్ర‌వ‌రి 19న స్వర్ణ రథోత్సవం
 
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన బుధ‌వారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4.30 నుండి 5.00 గంటల వరకు స్వామివారు స్వర్ణ రథారోహణం చేస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.