REVIEW MEETING ON VONTIMITTA BTUs HELD BY JEO _ వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు- అధికారులతో జేఈవో శ్రీ వీరబ్రహ్మం సమీక్ష

DHWAJAROHANAM ON MARCH 31

TIRUPATI, 02 FEBRUARY 2023: In the wake of the annual brahmotsavams and State Festival of Sri Sita Rama Kalyanam at Vontimitta Kodandaramalayam are scheduled from March 31 to April 8, TTD JEO Sri Veerabrahmam held a review meeting with all the department heads on the same on Thursday evening.

During the meeting at his chambers in TTD Administrative Building the JEO directed officials concerned to prepare an action plan on various preparatory activities to be executed for the mega religious festival in YSR Kadapa district. 

He instructed the officials to commence the activities from now onwards including the arrangements of deputation of officials and employees, deployment of Srivari Sevaks, accommodation to all, preparation of Talambralu, Annaprasadams, sanitation, engineering works, floral decorations, Bhajana teams, security measures etc.

He also directed the vigilance officials to co-ordinate with the local police and made necessary parking and security arrangements for the visiting devotees especially at Kalyana Vedika on the day of celestial marriage.

Deputy EOs Sri Govindarajan, Sri Gunabhushan Reddy, Sri Subramanyam, SVETA Director Smt Prasanti, Annaprasadam Catering Special Officer Sri Shastry, Additional HO Dr Sunil, DFO Sri Srinivasulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

– మార్చి 30న అంకురార్పణ, 31న ధ్వజారోహణం

– అధికారులతో జేఈవో శ్రీ వీరబ్రహ్మం సమీక్ష

తిరుపతి 2 ఫిబ్రవరి 2023: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులకు సూచించారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల తన చాంబర్లో గురువారం సాయంత్రం ఆయన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీని ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకువసతి ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు.

ఆలయం, కల్యాణ వేదిక వద్ద భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుని పారిశుధ్యం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అవసరమైన మందులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన బృందాలచే ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలని, అలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రథోత్సవ నిర్వహణ ఎలా ఉండాలి, సిబ్బంది ఎంతమంది అవసరం అనే విషయాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. కాగా మార్చి 30వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 31 వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

సమీక్షలో డిప్యూటీవోలు శ్రీ గుణ భూషణ్ రెడ్డి, శ్రీ గోవిందరాజన్ ,శ్రీ సుబ్రహ్మణ్యం, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, అన్నదానం ప్రత్యేక అధికారి శ్రీ జి ఎల్ ఎన్ శాస్త్రి,అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్,డి.ఎఫ్.ఓ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది