RAMAKRISHNA THEERTHA MUKKOTI AND POURNAMI GARUDA SEVA ON FEBRUARY 5 _ ఫిబ్రవరి 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ & శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

TIRUMALA, 02 FEBRUARY 2023: Ramakrishna Theertha Mukkoti and Pournami Garuda Seva will be observed on Sunday, February 5 on the auspicious day of Magha Pournami.

 

Among the 3crore odd theertham in the Seshachala ranges, the seven important torrents, Swamy Pushkarini, Akasa Ganga, Papavinasanam, Tumburu, Kumaradhara, Pandava and Ramakrishna Theertham are considered the most significant. 

 

The Ramakrishna Theertham is located 6miles from Tirumala temple. The temple staff perform special pujas to the idols of Sri Rama and Sri Krishna located in the torrent and return to the temple.

 

GARUDA SEVA: Sri Malayappa Swamy will take a special ride on the finely decked Garuda Vahanam along the four mada streets between 7pm and 9pm to bless His devotees on the evening of February 5 at Tirumala.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
 
తిరుమల, 2023 ఫిబ్రవరి 02: తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
 
ఫిబ్రవరి 5న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి  
 
తిరుమల దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 5వ తేదీ శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. 
 
పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించిన యెడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి.
 
”శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి” ప్రతి ఏటా మాఘ మాసం నందు నిర్వహించడం ఆనవాయితి. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 
 
స్కంద పురాణాను సారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందెను.
 
ఎవరైన మానవులు అజ్ఞానంతో తల్లి దండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషమును, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం.
 
ఈ పర్వదినంనాడు ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.
 
ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టిటిడి అధికారులు, భక్తులు పాల్గొంటారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.