SPRING FESTIVAL HELD _ వైభవంగా శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం

TIRUPATI, 16 FEBRUARY 2023: As part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram, Vasanthotsavam was observed on Thursday.

 

Also known as Upasamanotsavam, this fest usually performed in the spring season. As the deities get tired due to hectic rituals during all these days, as a Festival of Relief from hot summer, Vasanthotsavam is being observed.

 

Special Gr DyEO Smt Varalakshmi and other temple staffs were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం

తిరుప‌తి, 2023 ఫిబ్ర‌వ‌రి 16: శ్రీ‌నివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వ‌సంతోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది.

వసంతఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మ‌వార్లు ఉద‌యం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు. వారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు. వసంతోత్సవంలో చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. అనంత‌రం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ వెంకట స్వామి, కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.