ARRANGEMENTS FOR MAHA SIVA RATRI ON FULL SWING _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఫిబ్ర‌వ‌రి 18న మహాశివరాత్రి 

TIRUPATI, 16 FEBRUARY 2023: With the big day for Maha Siva Ratri is just left with a day to go, TTD has made elaborate arrangements for the visiting devotees at Sri Kapileswara Swamy temple on February 18.

 

The parking, barricading, queue lines, shades, Annarpasadam, water distribution, security etc. are being planned in an elaborate manner which will come into effect from the early hours of Saturday to meet the pilgrim crowd.

 

After the Mahanyasapoorvaka Ekadas Rudrabhishekam will be performed between 2.30am and 4.30am on the day of Maha Sivaratri while Rathotsavam between 8am and 10am followed by Snapana Tirumanjanam. 

 

In the evening, between 6pm and 10pm, the Nandi Vahana Seva is observed while the devotees will be allowed for darshan between 5.30am and 2pm, again between 4.30pm and 12mid night. On February 19, Lingodbhava Darshana Abhishekam will be performed between 12am till 4am.

 

On the same day evening, Sri Kamakshi Sameta Sri Kapileswara Swamy as Siva Parvathi bless devotees in celestial Kalyanam between 6pm and 7pm. The devotees shall participate in Siva Parvati Kalyanam on payment of Rs.250 per ticket on which two persons will be allowed.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఫిబ్ర‌వ‌రి 18న మహాశివరాత్రి

తిరుపతి, 16 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 18వ తేదీ శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘ‌నంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.

ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 19న శివపార్వతుల కల్యాణం

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన ఆదివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.