JEO REVIEWS ON SKVST BTUs _ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

TIRUPATI, 04 FEBRUARY 2023: As the annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy are slated for next week, TTD JEO Sri Veerabrahmam reviewed over the ongoing arrangements with the officials on Saturday evening at the temple of Srinivasa Mangapuram.

He directed the officials concerned to complete all the works on schedule and also reviewed on the temple programme, Annaprasadam, distribution of water, sale of laddus, condition of vahanams, medical facilities, electrical and floral decorations, parking facilities, vigilance and security measures, especially on the day of Garuda Vahanam on February 15 etc.

Later he inspected the mada streets along with the officials and made some valuable suggestions to them.

SE Electrical Sri Venkateswarulu, EE Sri Murali, Special Grade DyEO Smt Varalakshmi, DyEOs Smt Shanti, Sri Govindarajan, Gosala Director Dr Harnath Reddy, Garden Deputy Director Sri Srinivasulu, Additional Health Officer Dr Sunil, Ayurvedic College Medical Superintendent Dr Renu Dixit and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2023 ఫిబ్రవరి 04: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో శనివారం సాయంత్రం అధికారులతో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫిబ్రవరి 11వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, ఫిబ్రవరి 19వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చంద్రగిరి, తిరుపతిలలో బ్రహ్మోత్సవాల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. ఆలయ ప్రాశస్యము తెలిసేలా ఎస్విబిసిలో ప్రోమో ప్రసారం చేయాలని అధికారులకు సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్‌ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్‌ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టిటిడి విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మి, శ్రీ గోవిందరాజన్, శ్రీమతి శాంతి, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, గో సంరక్షణ డైరెక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి, గార్డెన్ సూపరిండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఈఈ శ్రీ మురళి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్, ఎస్ వి ఆయుర్వేద కళాశాల సూపరిండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.