ANNAPRASADAM AND WATER FACILITIES FOR RAMAKRISHNA THEERTHA MUKKOTI PILGRIMS _ రామకృష్ణ తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

PILGRIMS WITH CHRONIC DISEASES NOT ALLOWED FOR RAMAKRISHNA THEERTHA MUKKOTI

 

TTD EO

 

TIRUMALA, 04 FEBRUARY 2023: In connection with Ramakrishna Theertha Mukkoti in Tirumala on February 5 on the auspicious occasion of Magha Pournami, TTD EO Sri AV Dharma Reddy held a review meeting with officials at Annamaiah Bhavan on Saturday.

 

The important decisions includes

 

To operate 30 RTC buses for every 5 minutes to transport devotees avoiding the private vehicles and taxis as there is not enough parking space in the Papavinasanam area. From the Gogarbham area onwards private vehicles will not be allowed.

 

To provide Annaprasadam and water to the devotees trekking Ramakrishna Theertha Mukkoti from 5am onwards at the Papavinasanam dam.

 

TTD Vigilance, Police to monitor the security of the devotees.

 

To allow one person from Vigilance, Police, Forest for every 15 meters from Chaluvabanda point to Ramakrishna Theertham.

 

Devotees with heart-related diseases, Asthma, obesity, hypertension and aged are advised not to trek as the torrent is located interior in Seshachala Ranges and is very steep

 

To keep ready three medical teams at Papavinasanam dam, Chaluvabanda and Theertham in case of any emergency. 

 

After 12 noon the entry will be closed from the Papavinasanam dam to trek the Ramakrishna Theertham in view of the safety of devotees.

 

SE 2 Sri Jagadeeshwar Reddy, GM Transport Sri Sesha Reddy, DyEOs Sri Harindranath, Sri Selvam, HO Dr Sridevi, Additional SP Sri Muniramaiah, VGO Sri Bali Reddy and other officials from TTD and police were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రామకృష్ణ తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

– యాత్రికుల కోసం అన్నప్రసాదం మరియు తాగునీరు సౌకర్యాలు

– రామకృష్ణ తీర్థ ముక్కోటికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడరు

– టీటీడీ ఈఓ

తిరుమల, 2023 ఫిబ్రవరి 04: మాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 5న తిరుమల రామకృష్ణ తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు :

– పాప నాశనం పరిసరాలలో తగినంత పార్కింగ్ స్థలం లేనందున ప్రైవేట్ వాహనాలు మరియు టాక్సీలను గోగర్భం డాం వద్ద నుండే అనుమతించరు.

– భక్తుల రవాణాకు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున మొత్తం 30 ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.

– ఉదయం 5 గంటల నుండి రామకృష్ణ తీర్థం ముక్కోటికి వెళ్లే భక్తులకు అన్నప్రసాదం మరియు తాగు నీరు అందిస్తారు.

– భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు చలువ బండ పాయింట్ నుంచి రామకృష్ణ తీర్థం వరకు ప్రతి 15 మీటర్లకు విజిలెన్స్, పోలీస్, ఫారెస్ట్ నుంచి ఒకరిని కేటాయింపు.

– గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, స్థూలకాయం, రక్తపోటు ఉన్న భక్తులు మరియు వృద్ధులు ట్రెక్కింగ్ చేయ వద్దని మనవి.

– పాపవినాశనం, చలువబండ, రామకృష్ణ తీర్థ ముక్కోటి వద్ద మూడు వైద్య బృందాలు సిద్ధం.

– మధ్యాహ్నం 12 గంటల తర్వాత పాప వినాశనం నుండి రామకృష్ణ తీర్థ ప్రవేశం మార్గం మూసివేయబడుతుంది.

ఈ సమావేశంలో ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, జీఎం ట్రాన్స్‌పోర్ట్ శ్రీ శేషారెడ్డి, డీఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ సెల్వం, ఆరోగ్య విభాగం అధికారిని డాక్టర్ శ్రీదేవి, అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్య, వీజీవో శ్రీ బాలిరెడ్డి, టీటీడీ, పోలీసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.