PUSHPAYAGAM HELD _ శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

TIRUPATI, 29 NOVEMBER 2022: The annual Pushpayagam was held with celestial fervor in Tiruchanur temple on Tuesday evening.

After the successful completion of the annual Karthika brahmotsavams the floral festival was held to Sri Padmavathi Ammavaru. It is also known as “Prayaschitta Utsavam”, seeking the divine intervention to pardon the sins or mistakes either knowingly or unknowingly by temple staff, archakas and devotees as well.

Nearly 4 tonnes of different varieties of flowers have been used for performing Pushpa Yagam.

This unique fete took place in Sri Krishna Mukha Mandapam between 5 pm and 8 pm.

Board members Sri Maruti Prasad, Sri Milind Keshav, Sri Sourabh, JEO Sri Veerabrahmam, Deputy EO Sri Lokanatham, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Prabhakar Reddy, Garden Manager Sri Janardhan Reddy, Arjitam Inspector Sri Damu, devotees were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుపతి, 29నవంబర్ 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం మంగళవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.

వేడుకగా స్నపన తిరుమంజనం :

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

పుష్ప‌యాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2.5 టన్నులు తమిళనాడు, 1.5 టన్నులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు.

వైభవంగా పుష్పాల ఊరేగింపు :

మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మిలిన్ కేశవ్ నర్వేకర్, శ్రీ బోరా సౌరబ్ , జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, గార్డెన్‌ మేనేజర్‌ శ్రీ జనార్ధన్‌ రెడ్డి, ఆర్థితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.